Foot Pain Relief Home Remedies – Health Tips in Telugu || Aadhan Health

0



Hello Everyone, here we are showing simple home remedies for the foot pain epidemic. Here you know that how to relieve your foot, heel, and plantar fasciitis pain AT HOME, and it’s shown in a easy to follow step-by-step guide. These home remedies will help you to get rid of foot pain fast!

#FootPain #footpainhomeremedy #HealthTips

Foot Pain Relief Home Remedies:
పాదాల నొప్పి చిటికెలో త‌గ్గించే చిట్కాలు
పాదాల‌నొప్పి స‌మ‌స్య వేధిస్తోందా…. ఈ సింపుల్ చిట్కాల‌తో ఆ స‌మ‌స్య‌కు పుల్‌స్టాప్ పెట్టేయండి..
పాదాల‌పై బొబ్బ‌లు వ‌చ్చి మంట పెడుతున్నాయా….ఇలా మ‌సాజ్ చేస్తే నిమిషాల్లో బొబ్బ‌లు మాయం..

Introduction 00:00
Foot Pain Relief Remedy 1 – 00:36
Foot Pain Relief Remedy 2 – 01:10
Foot Pain Relief Remedy 3 – 01:25
Foot Pain Relief Remedy 4 – 01:37
Foot Pain Relief Remedy 5 – 01:59
Foot Pain Relief Remedy 6 – 02:03

మ‌న‌లో చాలామందికి న‌డుస్తున్న‌ప్పుడు పాదాల నొప్పి వ‌స్తుంటుంది. ముఖ్యంగా కాలి మ‌డం ద‌గ్గ‌ర వ‌చ్చే నొప్పిని అస్స‌లు భ‌రించలేం. ఆలాంటి ఇబ్బందిని కొన్ని స‌హ‌జ‌మైన ప‌ద్ద‌తులు, remedies తో శాశ్వ‌తంగా దూరం చేసుకోవ‌చ్చు. అవేంటే ఈ వీడియోలో మీకు explain చేస్తాను.

* మ‌నం ధ‌రించే చెప్పులు కానీ , షూ కానీ లైట్‌వెయిట్‌గా ఉండేలా చూసుకోవాలి
* ఎప్పుడూ షూ వేసుకుని ఉండేవారి పాదాలు కొన్నిసార్లు బొబ్బ‌లు వ‌చ్చి ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి కారణం పాదాల‌కు గాలి త‌గ‌ల‌క‌పోవ‌డం. కొన్ని home remediesతో ఈ బొబ్బ‌లను సులభంగా త‌గ్గించుకోవ‌చ్చు.
* అవాలు.. పాదాల నొప్పిని త‌గ్గించ‌డంలో అద్భుతంగా పని చేస్తాయి. ఇవి బ్ల‌డ్ స‌ర్క్యులేష‌న్‌ను మెరుగుప‌రుస్తాయి. శరీరంలోని ట్యాక్సిన్‌, వాట‌ర్‌ను త‌గ్గించి వాపును నివారిస్తుంది. పాదాల మంట‌ను త‌గ్గిస్తుంది. ఒక గుప్పెడు ఆవాల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి ఒక అర బ‌కెట్టు గోరువెచ్చ‌ని నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ వాట‌ర్‌లో మీ పాదాల‌ను ఒక ప‌దిహేను నిమిషాల పాటు ఉంచండి. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు తీసి ఒక పొడి ట‌వ‌ల్‌తో తుడ‌వండి. ఇలా చేస్తే మీ పాదాల నొప్పి నిమిషాల్లో త‌గ్గిపోతుంది.

* stretching తో కూడా పాదాల నొప్పిని పోగొటొచ్చు. ఒక చైర్‌లో కూర్చుని కాళ్ల‌ను బాగా చాపి పాదాలు నేల‌కు అదిమి పెట్టి ఉంచండి. అలా నిమిషంపాటు ఉండి మ‌ళ్లీ కాసేపు నార్మ‌ల్ పొజిష‌న్‌లో ఉంచండి. అలా రోజుకు ఐదు సార్లు అంత‌కంటే ఎక్కువ‌గా చేస్తూ ఉంటే మీ పాదాల‌నొప్పి కంట్రోల్ అవుతుంది.

* ల‌వంగం నూనె, నువ్వెల‌నూనె మిక్స్ చేసి మీ పాదాల‌కు gentleగా మ‌సాజ్ చేయండి. పాదాల నొప్పిని త‌గ్గించ‌డంలో ఇది బాగా ప‌నిచేస్తుంది. ఇలా రోజులో మూడు సార్లు చేస్తూ ఉండండి. ఫ‌లితం మీకే తెలుస్తుంది.

* ఐస్ మ‌సాజ్‌తో కూడా మీ పాదాల‌నొప్పిని పోగొట్టుకోవ‌చ్చు. ఏదైనా ప్లాస్టిక్ క‌వ‌ర్‌లోగాని, ఐస్‌బ్యాగ్‌లో గానీ కొంత ఐస్‌ను తీసుకుని పాదాల‌పై మ‌సాజ్ చేయండి. ఇలా చేస్తే పాదాల‌వాపు త‌గ్గి నొప్పి తొలిగిపోతుంది. అయితే ఈ ఐస్ మ‌సాజ్‌ను 5 నిమిషాల‌కు మించి ఎక్కువ‌గా చేయకండి. ఎందుకంటే ఐస్ మీ న‌రాల‌ను, స్కిన్ ను డ్యామేజ్ చేస్తుంది.

* అలాగే మీ పాదాల‌ను వాట‌ర్‌లో ఉంచి మ‌సాజ్ చేసుకోవ‌డం ద్వారా కూడా పాదాల నొప్పిని త‌గ్గించొచ్చు.

* మ‌రో ప‌ద్ద‌తిలో రెండు ట‌బ్‌ల‌లో చ‌ల్ల‌నినీరు, గోరువెచ్చ‌ని నీటిని తీసుకోండి. మొద‌ట మీ పాదాల‌ను ఐదు నిమిషాల పాటు చ‌ల్ల‌ని నీటిలో డిప్ చేయండి, ఆ త‌ర్వాత ఐదు నిమిషాల‌పాటు గోరువెచ్చ‌ని నీటిలో డిప్ చేయండి. ఇలా చేయడం వ‌ల్ల పాదాల ర‌క్త‌నాళాల్లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రిగి కండ‌రాలు వ‌దుల‌వుతాయి. త‌ద్వారా పాదాల‌నొప్పిని దూరం చేసుకోవ‌చ్చు.

health tips in telugu,foot pain relief in telugu,telugu health tips,home remedies,foot pain relief home remedies,heel pain remedies in telugu,home remedies for foot pain in telugu,heel pain relief exercises in telugu,How to Relieve Foot Pain,how to relieve foot pain at home,how to get rid of foot pain for good,foot pain relief exercises,foot pain relief stretches,heel pain relief treatment,Foot Pain Relief Home Remedies,aadhan health

source

Comments are closed.

You have successfully subscribed to the newsletter

There was an error while trying to send your request. Please try again.

Health Santa will use the information you provide on this form to be in touch with you and to provide updates and marketing.